News January 2, 2025
BREAKING: మరోసారి భూప్రకంపనలు
AP: ప్రకాశంలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Similar News
News January 7, 2025
స్వెటర్ ధరించే నిద్ర పోతున్నారా?
కొందరు రాత్రి పూట కూడా స్వెటర్ ధరించి నిద్రిస్తుంటారు. అలా చేస్తే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. స్వెటర్ బిగుతుగా మారి రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. ఉదయం లేచేసరికి చేతులు, కాళ్లలో తిమ్మిరి సమస్య ఏర్పడుతుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచడం వల్ల దురద, దద్దుర్లు వస్తాయి. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి తేలికైన దుస్తులు ధరించాలి.
News January 7, 2025
నేటి ముఖ్యాంశాలు
* చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
* దేశంలో 6 hMPV వైరస్ కేసులు నమోదు
* అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేంద్రం సూచన
* ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ఆస్పత్రుల అసోసియేషన్
* TG: ఏసీబీ విచారణకు హాజరుకాని కేటీఆర్
* ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి 8 మంది జవాన్ల మృతి
News January 7, 2025
కేటీఆర్ విజ్ఞప్తికి అంగీకరించిన ఈడీ
TG: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో KTR విజ్ఞప్తికి ED అంగీకరించింది. రేపు కోర్టు తీర్పు ఉన్నందున్న తాను విచారణకు రాలేనని ఆయన ఈడీకి లేఖ పంపిన విషయం తెలిసిందే. దీంతో రేపటి విచారణ నుంచి KTRకు మినహాయింపు ఇచ్చింది. అటు ఇదే కేసులో ఇవాళ ACB కార్యాలయం వరకు వెళ్లిన ఆయన తన లాయర్‌ను లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో ACB మరోసారి KTRకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని సూచించింది.