News March 16, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> ఏసీబీ వలలో జలమండలి అధికారులు
> ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. నగర వ్యాప్తంగా నిరసనలు
> ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
> లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష సమావేశం
> లాలాపేటలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీరు
> అమీన్‌పూర్ PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
> జీడిమెట్లలో 5 కేజీల గంజాయి స్వాధీనం
> హయత్‌నగర్-ఎల్బీనగర్ రూట్‌లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు
Similar News
News January 4, 2026
GHMCలో మరోసారి బదిలీలు.. రంగంలోకి కొత్త JCలు!

నగర పాలక సంస్థలో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. GHMC కమిషనర్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ కె.వేణుగోపాల్‌ను మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల జాయింట్ కమిషనర్‌గా నియమించారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గీతా రాధికను కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి.
News January 4, 2026
సైబరాబాద్ పోలీస్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నంబర్లు 87126 సిరీస్‌కు మారాయి. పాత నంబర్లు ఇకపై పనిచేయవు. నేటి నుంచి కొత్త నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని పోలీసులు తెలిపారు. సీపీ డా.ఎం.రమేశ్- 87126630001, జాయింట్ సీపీ- 8712663002, సీపీ CP- 8712663006, డీసీపీలు ఎస్‌బీ- 3003, మాదాపూర్- 3004, బాలానగర్- 3005, డబ్ల్యూ & సీఎస్‌డబ్ల్యూ- 3008, క్రైమ్- 3009లలో ఇక నుంచి సంప్రదించాలి.
News January 4, 2026
HYD: లవర్ మోజులో.. భర్తను చంపేసింది

మహిళ, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్లంబర్ నారాయణ (35) భార్య బంధిత (27), కుమార్తె (6)తో మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఆమె, అడ్డొస్తున్నాడని లవర్‌తో కలిసి రాడ్డుతో కొట్టి చంపింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల విచారణలో భార్య నేరాన్ని అంగీకరించింది.


