News January 2, 2025
జ్యోతి యర్రాజీ నేపథ్యమిదే..

పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన జ్యోతి యర్రాజీకి కేంద్రం <<15045760>>అర్జున<<>> అవార్డు ప్రకటించింది. వైజాగ్‌కు చెందిన ఈ పరుగుల రాణి 1999 ఆగస్ట్ 28న జన్మించారు. స్థానికంగానే విద్యాభ్యాసం చేశారు. 25 ఏళ్లకే అనేక జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు(12.78 సెకన్లు) ఇంకా ఆమె పేరిటే ఉంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో రజతం, WUGలో కాంస్యం సాధించారు.
Similar News
News January 12, 2026
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారు.
News January 12, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ రివ్యూ & రేటింగ్

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది. చిరు-వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రెగ్యులర్ స్టోరీ, ముందే ఊహించగల కొన్ని సీన్లు మైనస్.
రేటింగ్: 3/5
News January 12, 2026
చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్లు

AP: చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. DECలో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.


