News January 2, 2025
ADB: పెద్దపులి దొరికిందోచ్..!
ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News January 7, 2025
జిల్లా తుది ఓటరు జాబితా విడుదల: MNCL కలెక్టర్
మంచిర్యాల జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటరు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన తుది ఓటరు జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు.
News January 7, 2025
MNCL: పరీక్షల షెడ్యూల్ విడుదల..!
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News January 6, 2025
స్త్రీలను కోటీశ్వరులను చేసేందుకు కృషి: MNCL కలెక్టర్
ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. ముల్కల్ల పంచాయతీ వీరాంజనేయులు SHG సభ్యురాలు విజయకు సంచార చేపలు విక్రయించేందుకు వాహనాన్ని సోమవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతతో వ్యాపారాన్ని నిర్వర్తించి కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.