News March 17, 2024

చైనాలో వింత.. తోకతో జన్మించిన చిన్నారి

image

చైనాలో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు 10 సెంటీమీటర్ల పొడవు తోకతో పాప జన్మించింది. వీపు వైపు ఇది బయటకు వచ్చింది. పిండం సరిగ్గా ఎదగకపోవడం, జన్యుపరమైన లోపాలు, వెన్నెముక పెరగడంలో సమస్యల కారణంగా ఇలాంటి అరుదైన పిల్లలు పుడతారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని caudal appendageగా వ్యవహరిస్తారని వివరించారు. ఈ తోక నాడులతో అనుసంధానమైందున తొలగించడానికి డాక్టర్లు నిరాకరించారు.

Similar News

News November 22, 2024

ప్రభుత్వంలో నా స్థానం 11: పొంగులేటి

image

TG: ప్రభుత్వంలో తాను 11వ స్థానంలో ఉన్నానని మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ తర్వాతి స్థానంలో ఎవరు ఉన్నారని ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. రెండో స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు.

News November 22, 2024

విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ పబ్లిక్ టాక్

image

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’ ఈరోజు విడుదలైంది. ప్రీమియర్స్, USAలో మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇది కొత్త కాన్సెప్ట్ అని, ఫస్టాఫ్ కాస్త నిరాశపరిచినా సెకండాఫ్ పైసా వసూల్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ట్విస్టులు, విశ్వక్-హీరోయిన్ల మధ్య సీన్లు అదుర్స్ అంటున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News November 22, 2024

రహానే సరసన బుమ్రా నిలుస్తారా?

image

AUS గడ్డపై కెప్టెన్సీ చేసిన తొలి టెస్టులో గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రహానే పేరిట రికార్డు ఉంది. నేడు ప్రారంభం కానున్న BGT తొలి టెస్టులో భారత్ గెలిస్తే రహానే సరసన బుమ్రా చేరనున్నారు. AUSలో బుమ్రాకు కెప్టెన్‌గా ఇదే ఫస్ట్ టెస్ట్. కాగా గతంలో అమర్నాథ్, చందు బోర్డే, పటౌడీ, బిషన్, గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కోహ్లీ AUSలో కెప్టెన్‌గా తమ తొలి టెస్టులో ఓడారు.