News January 2, 2025
BSFపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

చొరబాటుదారులు బెంగాల్‌లోకి ప్రవేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకరిస్తోందని CM మమత ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్, సితాయ్, చోప్రా సరిహద్దుల నుంచి చొరబాటుదారుల్ని అనుమతిస్తున్నారని అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచి, ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో BSF అక్రమాలకు మద్దతిస్తూ తమను నిందించవద్దని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.
Similar News
News January 26, 2026
ఇండోర్‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.
News January 26, 2026
312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 26, 2026
RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


