News January 2, 2025

VIRAL: తులం బంగారం రూ.113 మాత్రమే

image

ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే. 1959లో తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 60 ఏళ్లలో బంగారం ధర ఇన్ని రెట్లు పెరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే రూ.78వేలు కావాల్సిందే. అప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కొనేందుకు డబ్బులు ఉండకపోయేవని పెద్దలు చెప్తుండేవారు.

Similar News

News February 4, 2026

భారత GDP వృద్ధి 6.9%: గోల్డ్‌మన్ శాక్స్

image

ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం, భారత వస్తువులపై USA టారిఫ్‌ల తగ్గింపుతో.. పలు రేటింగ్ సంస్థలు మనదేశ వృద్ధి అంచనాలను సవరిస్తున్నాయి. ఈ ఏడాది భారత GDP వృద్ధిని 6.9 శాతంగా గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే తక్కువ సుంకాలు అమలై, దేశ GDPలో సుమారు 0.2% వృద్ధి కనిపిస్తుందని వెల్లడించింది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి ఆర్థిక పరిస్థితులకు మద్దతు లభిస్తుందని పేర్కొంది.

News February 4, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 04, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 4, 2026

పది, ఇంటర్ ఫలితాల్లో 100% టార్గెట్: బాల వీరాంజనేయస్వామి

image

AP: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోని పదో తరగతితో పాటు ఇంటర్ విద్యార్థుల్లో ప్రతిఒక్కరూ పాసవ్వడమే లక్ష్యమని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన రివ్యూలో స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ట్యూటర్లు, కెరీర్ గైడెన్స్, ఎంసెట్, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేరెంట్స్ లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.