News January 2, 2025

నెల్లూరుకు భారీగా యూరియా రాక

image

తొలికారు వరిసాగు నేపథ్యంలో నెల్లూరులో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యూరియా కొరత విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణయ్య నాయుడు అగ్రికల్చర్ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో గురువారం ఒక వ్యాగన్(2700 టన్నులు)లో యూరియా రాగా, మరో రెండు వ్యాగన్లు మార్గమధ్యలో ఉన్నాయి.

Similar News

News December 30, 2025

నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

image

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.

News December 30, 2025

నెల్లూరు: ఆ ఘనత మనకే..!

image

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.

News December 30, 2025

టాప్-2లో నెల్లూరు జిల్లా

image

పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లా జనాభా తగ్గింది. గతంలో 4 డివిజన్లు, 38 మండలాలు, 24, 69,707 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో మండలాల సంఖ్య 36కు తగ్గింది. జనాభా సైతం 22,99, 699కి పడిపోయింది. అయినప్పటికీ జనాభా, మండలాల పరంగా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తిరుపతి, మండలాల పరంగా కడప(41) టాప్‌లో ఉన్నాయి.