News January 2, 2025
ఇంద్రవెల్లి: జనవరి 28 నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గురువారం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దర్బార్ హాల్లో జిల్లా అధికారులు, దేవాదాయ, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 7, 2025
ఆదిలాబాద్ DSPగా విజయ్ కుమార్
అవినీతి నిరోధక శాఖ ఆదిలాబాద్ DSPగా పి.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది బొకో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీకి సంప్రదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064లో వివరాలు తెలియజేయాలన్నారు.
News January 7, 2025
జిల్లా తుది ఓటరు జాబితా విడుదల: MNCL కలెక్టర్
మంచిర్యాల జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటరు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన తుది ఓటరు జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు.
News January 7, 2025
MNCL: పరీక్షల షెడ్యూల్ విడుదల..!
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.