News January 2, 2025
రేపు పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం: DEO

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రేపు అన్ని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.
News January 15, 2026
మెదక్: రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో టెన్షన్!

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ స్థానం ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. రిజర్వేషన్ల లెక్కలను బట్టి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 14, 2026
మెదక్: యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్‌కు దూరం, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.


