News January 2, 2025
శ్రీ సత్యసాయి కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.
Similar News
News May 7, 2025
ATP: NCORD జిల్లా స్థాయి కమిటీ సమావేశం

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో NCORD జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ జగదీష్‌తో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం నిర్వహించారు. నేరాలు, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం ఉన్న నిర్దిష్ట పెద్ద కేసుల కార్యాచరణ విషయాలపై చర్చించారు. మాదకద్రవ్యాల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News May 7, 2025
ATP: క్లైమ్ సెటిల్మెంట్, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి క్లైమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News May 7, 2025
మలేరియా అవగాహన ర్యాలీని ప్రారంభించిన DMHO

”మలేరియా అంత మనతోనే” అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి దేవి పేర్కొన్నారు. అనంతపురంలోని DMHO కార్యాలయంలో మలేరియాపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పరస్పర సహకారంతో ప్రజలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు వివరించారు.