News January 2, 2025
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష ప్రారంభించిన PK మరోసారి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోస్టుల్ని అమ్మకానికి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. Dec 13న జరిగిన 70వ BPSC ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
Similar News
News January 7, 2025
కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!
పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె పేరెంట్స్ తమిళనాడు, పంజాబ్‌కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.
News January 7, 2025
నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ
UPలో కుంభమేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్రభుత్వం బెంగాల్‌లో జరిగే గంగాసాగర్ మేళాకు ఎందుకివ్వదని CM మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్‌కు నీటి మార్గంలో చేరుకోవాలన్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా నది-బంగాళాఖాతం కలిసే చోటును గంగాసాగర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాతర జరుగుతుంది.
News January 7, 2025
జనవరి 07: చరిత్రలో ఈరోజు
* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం(ఫొటోలో)