News January 2, 2025
సీఎం కప్ పోటీల్లో ఖమ్మంకు ఐదు పతకాలు
హైదరాబాద్లో ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖమ్మం జిల్లాకు 5 పతకాలు సాధించినట్లు జిల్లా కోచ్, జాతీయ స్థాయి ప్రధాన న్యాయ నిర్ణేత తెలిపారు. సాయి భవ్యశ్రీ 24 కేజీల విభాగంలో, ప్రేమ్ కుమార్ 65 కేజీల విభాగంలో, జయవంత్ 56 కేజీల విభాగంలో, యువ తేజ్ చౌహాన్ 27 కేజీల విభాగంలో, జె ప్రహర్షన్ పాల్24 కేజీల విభాగంలో.. ఆయా క్రీడల్లో ప్రతిభ చూపి, బంగారు పతకాలు సాధించినట్లు వివరించారు.
Similar News
News January 7, 2025
30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాలకే: తుమ్మల
బడ్జెట్లో 30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరంలోనే రూ.73,000 కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టి దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ వంకతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,600 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందని తుమ్మల అన్నారు.
News January 6, 2025
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వదిలేసింది: పొంగులేటి
హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది శూన్యమన్నారు. ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు.
News January 6, 2025
KMM: 98.15శాతం పంపిణీ పూర్తి: బాల మాయాదేవి
అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఓటరు జాబితా ఉండాలని ఖమ్మం ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.బాల మాయదేవి సూచించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో 98.15% ఓటర్ కార్డులు పంపిణీ పూర్తి చేశామని, చనిపోయినవారి పేర్లు తొలగించామని అదనపు కలెక్టర్ తెలిపారు. బీసీ గురుకులాల్లో కామన్ డైట్ అమలు పర్యవేక్షించాలని అబ్జర్వర్ సూచించారు. ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని అన్నారు.