News January 2, 2025

సాగు చట్టాలను దొడ్డిదారిన తెచ్చే ప్రయత్నం: కేజ్రీవాల్

image

గతంలో ర‌ద్దు చేసిన సాగు చ‌ట్టాల‌నే కేంద్రం ‘విధానాల’ పేరుతో దొడ్డిదారిన అమలు చేయ‌డానికి సిద్ధ‌మవుతోంద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. హామీల సాధ‌న‌కు ఉద్య‌మించిన పంజాబ్ రైతుల‌కు ఏదైనా జ‌రిగితే ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌తో మాట్లాడ‌క‌పోవ‌డానికి బీజేపీకి ఎందుకంత అహంకారం అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Similar News

News November 7, 2025

కేంద్ర బలగాలతో ఉప ఎన్నిక నిర్వహించాలి: BRS

image

ECI అధికారులతో BRS MPలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. CM, మంత్రులు అధికార దుర్వినియోగానికి, కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలన్నారు. స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మహిళా అధికారులను నియమించాలన్నారు.

News November 7, 2025

వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

News November 7, 2025

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.