News January 2, 2025

₹550 CRతో కూతురి పెళ్లి! బికారిగా మారిన తండ్రి!

image

కర్మ! అన్ని సరదాలూ తీర్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. అపర కుబేరుల్లో ఒకరైన లక్ష్మీమిత్తల్ బ్రదరే ప్రమోద్. 2013లో కుమార్తె సృష్టి పెళ్లికి రూ.550CR ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు దివాలా తీసి బికారిగా మారి జైలుకెళ్లారు. ఆయన గ్యారంటర్‌గా ఉన్న GIKIL కంపెనీ $116mln రుణం తీర్చకపోవడంతో పతనం మొదలైంది. మోసం కేసులో 2019లో బోస్నియాలో అరెస్టయ్యారు. దివాలా తీసి భార్య, బిడ్డల నుంచి నెలవారీ ఖర్చుల కోసం దేహీ అంటున్నారు.

Similar News

News July 6, 2025

‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

image

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

image

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.