News January 3, 2025
TODAY HEADLINES
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’
* తెలంగాణలో సాగు చేసే అందరికీ రైతుభరోసా!
* గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
* ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు
* JAN 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
* ‘తొలి ప్రేమ’ రెమ్యునరేషన్‌తో బుక్స్ కొన్నా: పవన్ కళ్యాణ్
* పెళ్లి చేసుకున్న సింగర్ అర్మాన్ మాలిక్
* ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
* మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న
Similar News
News January 7, 2025
చలికాలం ఎక్కువగా తలనొప్పి వస్తోందా?
వింటర్లో సరిగ్గా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. దీంతో తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మజిల్స్ రిలాక్సై తలనొప్పి తగ్గుతుంది. హెడెక్ ఉన్న ట్రిగ్గర్ పాయింట్ వద్ద మసాజ్ థెరపీతోనూ ఉపశమనం పొందొచ్చు. ఇక తల, మెడ, భుజాలపై హీటింగ్ ప్యాడ్స్ పెట్టడం వల్ల కూడా రిలీజ్ లభిస్తుంది.
News January 7, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30కు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News January 7, 2025
టెంబా బవుమా సరికొత్త రికార్డ్
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్‌పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.