News March 17, 2024

నేతల ఫ్లెక్సీలను తొలగించండి: విజయనగరం కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమై ఎన్నికల నేపథ్యంలో ఆయా శాఖలు పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు. నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడంలో ముమ్మరంగా పనిచేయాలన్నారు.

Similar News

News December 28, 2025

ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదు: VZM ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు విధించబడ్డాయని వివరించారు.

News December 28, 2025

VZM: జిల్లాలోని 200 ఎకరాల్లో ఫుడ్ పార్క్‌లు

image

విశాఖ ఆర్థిక రీజియన్‌లో భాగంగా జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు, రెండు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో 200 ఎకరాల్లో ఫుడ్ పార్కులు, భోగాపురంలో ఏరోసిటీ, ఐటీ హబ్‌లకు భూముల గుర్తింపుపై శనివారం సమీక్షించారు. వాటికి భూసేకరణను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

News December 27, 2025

VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

image

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.