News January 3, 2025
ఏలూరు: సదరం పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి
సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.కన్నబాబు, సెర్ఫ్ సిఇవో వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.
Similar News
News January 7, 2025
కాళ్ల: మంత్రి లోకేశ్ హత్తుకున్న బాలుడు ఎవరంటే?
కాళ్ల మండలం పెదఅమిరంలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద సోమవారం మంత్రి నారా లోకేశ్ భరత్ అనే బాలుడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆచంటకు చెందిన ఈ బాలుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అంతేకాదు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఒకరోజు 12 గంటలు పచ్చి మంచినీరు ముట్టకుండా ఉపవాసం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
News January 7, 2025
ప.గో జిల్లా ఓటర్ల వివరాలు: కలెక్టర్
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2025 ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 6 నాటికి జిల్లాలోని మొత్తం 1,461 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,70,852 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,20,597, మహిళలు 7,50,179, థర్డ్ జెండర్ 76 మంది ఉన్నారు.
News January 7, 2025
నల్లజర్ల: మహిళ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్
మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదని తూ.గో.జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. నల్లజర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మర్లపూడి ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు పై కలెక్టర్ స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మహిళ ఫిర్యాదుపై భర్త, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు.