News January 3, 2025
మామిడి ఎగుమతుల్లో పోటీ పడాలి: వరంగల్ కలెక్టర్
మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ఎగుమతుల్లో పోటీ పడాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. గురువారం ఎనుమాముల మార్కెట్ కార్యాలయంలో వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో శుక్రవారం జరిగే మామిడి రైతుల అవగాహన కార్యక్రమంపై పండ్ల మార్చంటస్, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 7, 2025
వరంగల్: ఎయిర్‌పోర్టు కోసం స్థల పరిశీలన
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.
News January 6, 2025
HNK: సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పలువురు భక్తులు సిద్దేశ్వరుడిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
News January 6, 2025
WGL: క్వింటా మొక్కజొన్న ధర రూ.2,565
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.