News January 3, 2025
SHOCKING: జట్టు నుంచి రోహిత్ ఔట్!
సిడ్నీ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగా రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకొన్నారు. ఆయనకు బదులు కెప్టెన్‌గా బుమ్రా టాస్‌కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా రెస్ట్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక తుది జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు మార్ష్ స్థానంలో వెబ్‌స్టెర్ డెబ్యూ కానున్నారు.
Similar News
News January 7, 2025
కరవు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన రేపటి నుంచి..
AP: రాష్ట్రంలోని కరవు మండలాల్లో రేపటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రేపు, ఎల్లుండి పర్యటించి కరవు పరిస్థితులను తెలుసుకోనుంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని 27మండలాల్లో తీవ్ర కరవు, మరో 27మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు 3బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు.
News January 7, 2025
వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ
AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
News January 7, 2025
hMP వైరస్ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రి సిద్ధం!
TG: hMPV కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమేనని, 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. అటు బాధితులకు గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుమారు 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40వేల కి.లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.