News January 3, 2025
ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు
Similar News
News January 7, 2025
ఒంగోలు: కానిస్టేబుళ్ల రాత పరీక్షకు 233 మంది ఎంపిక
ఒంగోలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో సోమవారం జరిగిన కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 233 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 600 మంది అభ్యర్థులకు గాను 319 మంది మాత్రమే హాజరయ్యారు. వారికి ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పలు ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
News January 6, 2025
ఒంగోలు: ‘ఇలా చేస్తే మరణాలను నివారించవచ్చు’
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సోమవారం జిల్లాలోని ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సరైన సమయంలో గుర్తించి వైద్య సేవలు అందించడం ద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలను నివారించవచ్చు అని తెలిపారు.
News January 6, 2025
ప్రకాశంలో మహిళా ఓటర్లే ఎక్కువ.!
జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తన ఛాంబర్ సోమవారం ప్రకాశం జిల్లాకు సంబందించిన 8 నియోజకవర్గాల నూతన ఓటరు లిస్టుల సీడీ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పోలింగ్ బూతులు..2183, జిల్లా మొత్తం ఓటర్లు 1819448, పురుషు ఓటర్లు 905885, మహిళా ఓటర్లు 913450, థర్డ్ జండర్ ఓటర్లు 113 మంది అని తెలిపారు. జిల్లా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు.