News March 17, 2024
ఎన్నికలలో పోలీసులు చేయాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ: డీఎస్పీలు

త్వరలో జరగనున్న ఎన్నికల విధివిధానాల, విధుల పట్ల పోలీస్ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీలు శ్రీలత, శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కదిరి సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులకు ఎన్నికల విధులపై కదిరిలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ సెల్ పోలీస్ సిబ్బందికి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు.
Similar News
News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 10, 2025
గుంతకల్లు: రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఎస్ఆర్‌సి కమిటీ సభ్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.
News April 10, 2025
PGRS పిటిషన్‌లు పరిశీలించాలి: కలెక్టర్

PGRS పిటిషన్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టర్, రీసర్వే, తదితర అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, తదితరులతో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.