News January 3, 2025
ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.
Similar News
News January 7, 2025
CHECK: ఈ లిస్టులో మీ పేరుందా?
AP, TGకి సంబంధించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ-2025 తుది జాబితాను ఎన్నికల కమిషనర్లు నిన్న ప్రకటించారు. APలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లుండగా కొత్తగా 5.14 లక్షల మంది చేరారు. TGలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లుండగా కొత్తగా 2.19 లక్షల మంది నమోదయ్యారు. వీరికి త్వరలోనే పోస్టు ద్వారా ఎపిక్ కార్డులను అందజేయనున్నారు. కాగా ఫైనల్ <
News January 7, 2025
రాష్ట్రంలో పెరిగిన సముద్ర తీరం
AP: 1970 లెక్కలతో పోల్చితే రాష్ట్ర సముద్రతీరం పొడవు పెరిగింది. గతంలో 973.7కి.మీ. ఉన్న సాగర తీరం 8.15శాతం పెరిగి 1053.07కి.మీలకు చేరినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మలుపులు, ఒంపులనూ లెక్కించడంతో తీరం పొడవు పెరిగింది. దీంతో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానం(గతంలో 2వస్థానం)లో నిలిచింది. అటు 2,340.62 కి.మీలతో గుజరాత్ దేశంలోనే తొలిస్థానం, 1068.69 కి.మీ.లతో తమిళనాడు 2వ స్థానంలో నిలిచాయి.
News January 7, 2025
12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన
AP: పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిలు పర్యటించనున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.