News January 3, 2025
MBNR: చదివింది చారెడు.. చికిత్సలు బారెడు!
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News January 7, 2025
MBNR: ‘ఈనెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం’
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ ఈనెల 16 వరకు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ ఫీజు చెల్లించని మొదటి, ద్వితీయ సంవత్సరం, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
News January 7, 2025
NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందిస్తాం: జూపల్లి
కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు.
News January 7, 2025
MBNR: బాలికల భద్రతకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్
జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలు, వసతి గృహాలలో బాలికల భద్రతకు అన్నిచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలు ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డైట్ చార్జీల పెంపునకు అనుగుణంగా కామన్ మెన్ అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆమె ఆదేశించారు.