News January 3, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట ∆} ములకలపల్లి లో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News January 7, 2025
మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి..!
త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందనే ప్రచారంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు పండుగలు, పబ్బాలకు తాయిలాలు ఇస్తుండడమే కాక శుభ, అశుభ కార్యాల్లో స్థానికులతో మమేకమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 589 పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తొంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.
News January 7, 2025
30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాలకే: తుమ్మల
బడ్జెట్లో 30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరంలోనే రూ.73,000 కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టి దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ వంకతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,600 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందని తుమ్మల అన్నారు.
News January 6, 2025
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వదిలేసింది: పొంగులేటి
హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది శూన్యమన్నారు. ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు.