News January 3, 2025
MBNR: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధి చిలుకూరులో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం HYD వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి PSలో అప్పగించారు. కేసు నమోదైంది.
Similar News
News January 7, 2025
పాలమూరులో 34,54,354 మంది ఓటర్లు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,43,276 మంది మహిళలు, 17,10.989 మంది పురుషులు ఉండగా ఇతరులు 89 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం 13,404 మంది ఓటర్లు పెరగటం గమనార్హం.
News January 7, 2025
MBNR: ‘ఈనెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం’
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ ఈనెల 16 వరకు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ ఫీజు చెల్లించని మొదటి, ద్వితీయ సంవత్సరం, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
News January 7, 2025
NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందిస్తాం: జూపల్లి
కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు.