News January 3, 2025
చిత్తూరు: 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కడప జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎంహెచ్ఎఓ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడపలోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 7, 2025
నిమ్మనపల్లెలో అమానుషం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. మదనపల్లె తాలుకా రూరల్ సీఐ రమేశ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బోయకొండ(28)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. సుమారు 12 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలపై బోయకొండ లైంగిక దాడి చేశాడు. భార్యకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేశారు.
News January 7, 2025
TPT: PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 2గా పేర్కొన్నారు.
News January 6, 2025
చిత్తూరు: మిడ్ డే మీల్స్‌లో స్వల్ప మార్పు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో శనివారం ఒక్కరోజు మెనూలో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని DEO వరలక్ష్మి తెలిపారు. గతంలో శనివారం పాఠశాల విద్యార్థులకు గ్రీన్ లీఫీ వెజ్ రైస్, స్వీట్ పొంగల్, రాగి జావా పెట్టే వారన్నారు. ప్రస్తుతం స్వల్ప మార్పు చేస్తూ.. ఆ స్థానంలో రైస్, సాంబార్, వెజిటేబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, రాగి జావా వడ్డించాలన్నారు. మండలధికారులు పర్యవేక్షించాలని సూచించారు.