News January 3, 2025

కడప: 150 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్

image

కడప జిల్లా జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడప పాత రిమ్స్‌లోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్‌సైటును సంప్రదించాలన్నారు.

Similar News

News January 7, 2025

కడప: జాతీయ యూత్ ఫెస్టివల్‌కు ఎంపికైన సానియా

image

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎంపికైనట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పేర్కొన్నారు. జనవరి 10 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో నేషనల్ యంగ్ లీడర్ షిప్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు.

News January 6, 2025

కడప: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.