News January 3, 2025
BREAKING: కష్టాల్లో భారత్
ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.
Similar News
News January 7, 2025
ఈనెల 10న బీజేపీ నిరసనలు
TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు BJP ప్రకటించింది. ఆరోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికి రారని CM రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
News January 7, 2025
విశాఖలో డ్రోన్లపై నిషేధం
AP: నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు PM మోదీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కి.మీ పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం విశాఖలో పర్యటించనున్న మోదీ రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ప్రధాని నగరంలో రోడ్ షో నిర్వహించి సభాస్థలి వద్దకు చేరుకుంటారు.
News January 7, 2025
పాస్‌పోర్ట్ కోసం హైకోర్టులో జగన్ పిటిషన్
AP: లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ CBI కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన YCP చీఫ్ జగన్ తాజాగా హైకోర్టునూ ఆశ్రయించారు. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందన్నారు. అందువల్ల తాజా పాస్‌పోర్ట్ కోసం NOC ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.