News March 17, 2024
శుభ ముహూర్తం

తేదీ: మార్చి 17,
ఆదివారం, ఫాల్గుణము
శుద్ధ అష్టమి: ఉదయం 09:53 గంటలకు
మృగశిర: సాయంత్రం 04:47 గంటలకు
దుర్ముహూర్తం: సాయంత్రం 04:38-05:26 గంటల వరకు
వర్జ్యం లేదు
Similar News
News April 11, 2025
‘వక్ఫ్’పై ఈ నెల 16 నుంచి సుప్రీం విచారణ

వక్ఫ్ సవరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్ట్ చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవియట్ పిటిషన్ వేసింది.
News April 11, 2025
హెల్త్ చెకప్కోసం ఆస్పత్రికి కేసీఆర్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ నాయకత్వం శ్రేణులకు తెలిపింది. ఈ నెల 27న వరంగల్లో వజ్రోత్సవ సభకు ఆయన సిద్ధంగా ఉన్నారని వివరించింది.
News April 11, 2025
పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.