News January 3, 2025

SKLM: ఫసల్ బీమా యోజన సాయం పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

image

రైతులకు ప్రతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఫసల్ బీమా యోజన పరిహారాన్ని రూ.6000 నుంచి రూ.10000లకు పెంచుతూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న రెండు లక్షల 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో నాలుగు విడతలుగా రూ.1500 జమచేయగా ప్రస్తుతం రూ.2500 జమ చేస్తామన్నారు.  

Similar News

News January 23, 2026

సిక్కోలులో భారీగా పోలీసు బందోబస్తు: SP

image

జిల్లాలో రథసప్తమి వేడుకలకు 15 డ్రోన్ కెమెరాలు 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి వెల్లడించారు. నగరంలో బందోబస్తు ఏర్పాటుకు ఆరుగురు SPల పర్యవేక్షణలో 16 మంది DSPలు, 50 మంది CIలు, 170 మంది SIలు, 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి సెక్టార్లో భద్రతను పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు.

News January 23, 2026

వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

image

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.

News January 23, 2026

రాష్ట్రపతితో విందుకు సిక్కోలు విద్యార్థినికి ఆహ్వానం

image

శ్రీకాకుళం మండలం ఇప్పిలి జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇప్పిలి సంజనకు రాష్ట్రపతితో విందు చేసేందుకు ఆహ్వానం అందింది. శుక్రవారం పాఠశాల హెచ్ఎం సుజాత ఈ విషయాన్ని చెప్పారు. విద్యార్థిని సంజన గత మూడేళ్లుగా ప్రాజెక్టులు తయారు చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు పంపిస్తోంది. ఆమె తయారు చేసిన డ్యూయల్ సోలార్ ట్రాకర్ సిస్టం ప్రాజెక్ట్ ఆ సంస్థను ఆకర్షించింది. ఈమె ప్రతిభను గుర్తించి ఈ అవకాశం కల్పించింది.