News January 3, 2025
HYD: నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్

HYD రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని BJP నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RRR నార్త్ అలైన్‌మెంట్ మార్పు చేయాలని, లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
Similar News
News January 17, 2026
హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News January 17, 2026
మేడారంలో రేపు రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
News January 17, 2026
బీఆర్‌ఎస్ MLAలు, MLCలతో నేడు KTR కీలక భేటీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.


