News January 3, 2025

ఆ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

image

TG: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకోకపోతే ACBకి వివరాలు పంపిస్తానని, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని చెప్పారు.

Similar News

News January 7, 2025

శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్!

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని ఆయనకు పోలీసులు <<15079293>>నోటీసులు<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.

News January 7, 2025

వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు

image

AP: వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు.

News January 7, 2025

చైనా వైరస్.. వ్యాపించేది ఇలా

image

దేశంలో hMPV కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3-6 రోజుల తర్వాత లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం) కన్పిస్తాయి.