News January 3, 2025
అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని
APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 7, 2025
టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు!
AP: మెరుగైన పనితీరు కనబరిచిన టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా తీసుకురాబోయే బదిలీల చట్టంలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ప్రోత్సాహం లేకపోతే పనిలో పోటీ ఉండదని విద్యాశాఖ భావిస్తోంది. అటు బదిలీలకు విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాయింట్ల విధానం కచ్చితంగా అమలు చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.
News January 7, 2025
శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని ఆయనకు పోలీసులు <<15079293>>నోటీసులు<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 7, 2025
వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు
AP: వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు.