News January 3, 2025

హైందవ శంఖారావానికి తరలిరండి: VHP

image

AP: విజయవాడ కేసరపల్లి వద్ద JAN 5న జరిగే హైందవ శంఖారావం సభకు హిందువులు తరలిరావాలని VHP పిలుపునిచ్చింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో 30 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు హిందూ ఆలయాలను తమ అధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని VHP నేత గోకరాజు గంగరాజు మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాల కోసం పోరాటం చేస్తామన్నారు.

Similar News

News January 7, 2025

చైనా మాంజా అమ్మితే రూ.లక్ష వరకూ ఫైన్!

image

TG: సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 040-23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, ₹లక్ష వరకూ ఫైన్, మనుషులు, పక్షులకు హాని జరిగితే 3-5 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా ఉంటుందన్నారు. NGT ఆదేశాలతో TGలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు.

News January 7, 2025

తిరుమలలో పెరిగిన రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 16కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 7, 2025

స్పౌజ్ కేటగిరీ పెన్షన్‌పై వారిలో ఆందోళన!

image

AP: పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో భార్యకు ఇస్తున్న పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు, నవంబర్ 1- డిసెంబర్ 15 మధ్య 23K మంది చనిపోతే, స్పౌజ్ పెన్షన్లు 5K మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.