News January 3, 2025
వరంగల్ మార్కేట్లో పెరిగిన పల్లికాయ ధర

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు గురువారం రూ.7,200 ధర పలకగా.. నేడు రూ.7,300 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలకగా నేడు రూ.4,700 పలికింది. అలాగే 5531 రకం మిర్చి క్వింటాకు రూ.12,500, అగ్ని మిర్చి ధర రూ.14వేలు పలికింది.
Similar News
News September 14, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్‌లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
News September 13, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.
News September 12, 2025
ఎనుమాముల బియ్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎనుమాముల మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు.