News January 3, 2025
ఢిల్లీ చలీ మోదీ కే సాథ్.. BJP కొత్త ప్రచారం

ప్రధాని మోదీ కేంద్రంగానే ఢిల్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఢిల్లీ చలీ మోదీకే సాథ్ (ఢిల్లీ నడుస్తుంది మోదీ వెంట) నినాదంతో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించిన రోజునే BJP ఈ ప్రచారానికి తెరలేపడం గమనార్హం. ఈ సారి ఆప్‌ను గద్దెదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Similar News
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
News January 13, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరు <
News January 13, 2026
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన మీనాక్షి

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నటుడు, డాక్టర్ అవ్వకూడదని హీరోయిన్ మీనాక్షి చౌదరీ అన్నారు. అంతేకాకుండా మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఉండకూడదని తెలిపారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ హోదాల్లో ఉన్నానని చెప్పారు. అయితే తన ఫేవరెట్ డిష్ రాజ్మా 100 ఎకరాల్లో పండించే వ్యక్తి కావాలని తెలిపారు. హైట్ ఉండటంతో పాటు కుకింగ్ తెలిసి ఉండాలన్నారు. కాగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.


