News January 3, 2025

మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు

image

మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. UPHC ఇందిరా నగర్ నుంచి AIIMS మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం PAP స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. AIIMS సిబ్బందిని, అధికారులను అభినందించారు.

Similar News

News January 7, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు DMHO

image

చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

News January 7, 2025

గుంటూరు: అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

image

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేశాడని చుండూరు (M) మున్నంగివారిపాలెంకు చెందిన శ్రీనివాసరావు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయశాఖలో అటెండర్‌గా పనిచేసే ఎన్.సునీల్ తన బావమరిది ద్వారా పరిచయమయ్యాడన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడన్నారు. ఉద్యోగం రాలేదని, డబ్బులడుగుతుంటే బెదిరిస్తున్నాడని సోమవారం గ్రీవెన్స్‌లో వాపోయాడు.

News January 7, 2025

GNT: జిల్లాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.?

image

స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.