News January 3, 2025
విజయవాడ: కంపెనీలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఆర్టీసీ బస్సు ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం VJA నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న RTC మెట్రో బస్సు అదుపుతప్పి ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించారు. ఈ క్రమంలో హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది.
Similar News
News January 7, 2025
వీరవల్లి: ప్రియుడి మోజులో కూతురిని రోడ్డుపై వదిలిన తల్లి
బాపులపాడు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త రవి నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు మోజులో పడి బిడ్డను తల్లి వీరవల్లి రోడ్డుపై వదిలేసింది. సోమవారం బాలికను గుర్తించి నంద్యాల పోలీసులకు అప్పగించనున్నట్లు వీరవల్లి SI శ్రీనివాస్ తెలిపారు.
News January 7, 2025
పెనుగొలనులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.
News January 7, 2025
జగన్‌కు షాక్ ఇచ్చిన విజయవాడ కోర్ట్
పాస్‌పోర్టు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌ను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుకు NOC ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. 2024లోనే పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కాగా పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సూచించింది.