News January 3, 2025
HYD: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

HYD: రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. అదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని.. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News July 10, 2025
వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.
News July 9, 2025
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
News July 9, 2025
MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.