News January 3, 2025
‘కొత్త ఇసుకను రీచ్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి’

రాష్ట్రంలో కొత్త రీచ్‌లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఇసుక సరఫరా అంశంపై గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పీ.రంజిత్ బాషా హాజరై మాట్లాడారు.
Similar News
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్‌లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
News March 2, 2026
చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 103 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసాలు, ఆస్తి వివాదాలు, రుణ చెల్లింపుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన వినతులను అధికారులు నమోదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
News March 2, 2026
ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో CDPOలు, సూపర్వైజర్లతో ICDS శాఖ పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్షించారు. ప్రజల్లో శాఖపై సానుకూల అభిప్రాయం పెంపు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం, గర్భిణులకు అందే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


