News January 3, 2025
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో: బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

AP: నటి, బీజేపీ నేత మాధవీలతపై <<15051797>>అసభ్యకర వ్యాఖ్యలు<<>> చేసిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా లేదా అని ఫైరయ్యారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారనడం తగదన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ కూర్చునే వాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
Similar News
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.