News January 3, 2025

HMPV వ్యాప్తి తక్కువే: చైనా

image

చైనాలో కొత్తగా విస్తరిస్తోన్న <<15057647>>HMPV<<>>(Human metapneumovirus)పై ఆ దేశం స్పందించింది. దాని తీవ్రతను తక్కువచేసే ప్రయత్నం చేసింది. ‘ప్రతి వింటర్‌లో ఉత్తరార్ధగోళంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తి ఉంది. చైనా పౌరులతో పాటు విదేశీయుల ఆరోగ్యంపై మేం శ్రద్ధ చూపిస్తాం. చైనాలో పర్యటించడం సురక్షితమే’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు.

Similar News

News January 7, 2025

పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో, హీరోయిన్!

image

హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, జెండయా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో జెండయా డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఫ్యాన్స్ వారికి విషెస్ చెబుతున్నారు. ‘స్పైడర్‌మ్యాన్’ ఫ్రాంచైజీలో 3 సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 2021 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఎంగేజ్‌మెంట్‌పై వారు ప్రకటన చేయాల్సి ఉంది.

News January 7, 2025

కేటీఆర్ పిటిషన్‌పై మొదలైన కోర్టు ప్రొసీడింగ్స్

image

TG: ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. కాసేపట్లో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

News January 7, 2025

షేర్లు విలవిల.. బిట్‌కాయిన్ కళకళ

image

గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్న వేళ క్రిప్టో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.43% పెరిగి $3.58Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ నిన్న $3,871 (Rs3.30L) పెరిగి $1,02,235ను తాకింది. నేడు $1,01,872 వద్ద ట్రేడవుతోంది. Mcap 2.74% ఎగిసి $2.01Tకి చేరుకుంది. ఎథీరియం $3,700 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. 1.42% లాభంతో $3,687 వద్ద ముగిసింది. ప్రస్తుతం $3,665 వద్ద కొనసాగుతోంది.