News January 3, 2025
మార్కెట్లోకి రూ.5,000 నోట్లు.. క్లారిటీ
త్వరలో రూ.5,000 నోట్లు మార్కెట్లోకి రానున్నాయనే ప్రచారాన్ని RBI కొట్టిపారేసింది. అలాంటిదేమీ లేదని తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 నోట్లే చలామణిలో ఉన్నాయని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రస్తుత కరెన్సీ వ్యవస్థ సరిపోతుందని చెప్పింది. ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలూ ఆ దిశగానే మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.
Similar News
News January 7, 2025
దొంగలకు కోర్టు అండగా ఉండదు: అద్దంకి దయాకర్
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. విచారణే వద్దన్న కేటీఆర్ కోర్టుకు ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. దొంగతనం చేయలేదని నిరూపించుకోవడానికి యత్నాలా అని నిలదీశారు. దొంగలకు కోర్టు అండగా ఉండదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని దయాకర్ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణకే కోర్టులున్నాయని తెలిపారు.
News January 7, 2025
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
నటి సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అది జీవితంలో ఆనందాన్ని నింపుతుంది’ అని రాసుకొచ్చారు. 2020లో ఆమె ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో ఓ బాబు జన్మించాడు. సనా ఖాన్ తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
News January 7, 2025
భారీ భూకంపం.. 53కి చేరిన మరణాలు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.