News January 3, 2025
హెచ్ఐసీసీలో తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను ఆనాడే చెప్పానని ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందన్నారు. ఈ ప్రాతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందన్నారు.
Similar News
News February 26, 2026
మాస్టర్ ప్లాన్ 2050.. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ముసుగులో భూదందా!

HMDA సిద్ధం చేస్తున్న ‘విజన్ 2050’ మాస్టర్ ప్లాన్ ఇంకా నోటిఫై కాకముందే దానిలోని ‘గ్రీన్ జోన్’, ‘రెసిడెన్షియల్ జోన్’ వివరాలు లీక్ అయ్యాయి. ఏయే ప్రాంతాలు భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయో ముందే తెలుసుకున్న కొందరు అధికారులు, రాజకీయ నేతలు కలిసి చుట్టుపక్కల వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఈ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ విలువ దాదాపు ₹5,000 కోట్లకు పైమాటే.
News February 26, 2026
HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.


