News January 4, 2025
బ్రాహ్మణికి హీరోయిన్‌గా ఆఫర్: బాలకృష్ణ
అప్పట్లో మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మణికి హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానమిచ్చారు. బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరినీ గారాబంగా పెంచానని పేర్కొన్నారు. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. తాను బ్రాహ్మణికి ఎక్కువగా భయపడతానని తెలిపారు.
Similar News
News January 7, 2025
సుప్రీంకు వెళ్లే యోచనలో కేటీఆర్!
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అరెస్టుపై స్టే కూడా ఎత్తేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. అటు నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి హరీశ్ రావు, కవిత చేరుకున్నారు. లీగల్ టీమ్‌తో వీరు ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటని సమాలోచనలు చేస్తున్నారు.
News January 7, 2025
హైకోర్టు తీర్పు.. దూకుడు పెంచిన ఏసీబీ
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోనూ గ్రీన్ కో, ఏస్ జెన్‌నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.
News January 7, 2025
జత్వానీ కేసులో IPSలకు ముందస్తు బెయిల్
AP: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీ, ACP హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.