News January 4, 2025
మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్

అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో శుక్రవారం సాయంత్రం మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో 4వ రోజున ఈవెంట్స్ పారదర్శకంగా కొనసాగాయి. ప్రత్యేకంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించి, అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు.
Similar News
News May 7, 2025
పామిడి: బిడ్డకు ఐస్ తినిపిస్తున్న తల్లి కోతి.!

పామిడిలో తీవ్ర ఎండలకు మానవులతోపాటు పశు, పక్షాదులు తీవ్ర దాహంతో అల్లాడిపోతున్నాయి. దాహర్తిని తీర్చుకోవడానికి, మంచి నీటితోపాటు చల్లని పానీయాలతో ఐస్ క్రీమ్‌ల కోసం మనుషులు ఎగబడుతున్నారు. రహదారిపై ఐస్ తింటూ వెళ్లేవారి వద్ద ఐస్ లాక్కుని తల్లీ బిడ్డా ఐస్ తింటున్న ఫోటో ఇది.
News May 7, 2025
ATP: NCORD జిల్లా స్థాయి కమిటీ సమావేశం

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో NCORD జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ జగదీష్‌తో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం నిర్వహించారు. నేరాలు, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం ఉన్న నిర్దిష్ట పెద్ద కేసుల కార్యాచరణ విషయాలపై చర్చించారు. మాదకద్రవ్యాల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News May 7, 2025
ATP: క్లైమ్ సెటిల్మెంట్, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి క్లైమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.