News January 4, 2025
విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి: కలెక్టర్
విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.
Similar News
News January 8, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
‘పాన్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే.. ఈ రోజే మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ వచ్చే మెసెజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి లింకులు/apk ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయకూడదన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే బాధితులు 1930 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.
News January 7, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో ఈనెల 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 7, 2025
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయక్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్ అయ్యారు. కోర్టు స్టే ఉన్న ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ దర్యాప్తు జరిపారు. వాస్తవాలు గుర్తించి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉన్నంత వరకూ హెడ్ క్వార్టర్స్ వదిలి బయటికి వెళ్లరాదని ఆదేశించారు.