News March 17, 2024
రేపటి నుంచి పది పరీక్షలు

AP: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన దాదాపు లక్ష మంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12జ30 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Similar News
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
News September 10, 2025
వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.
News September 10, 2025
సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.