News January 4, 2025
కొత్త ఆవిష్కరణలకు మూలం పరిశోధనలే: తిరుపతి కలెక్టర్

నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనలు ఆవశ్యకమని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌పిబిఎస్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా టీచర్లు ప్రేరేపించాలని ఆయన కోరారు.
Similar News
News December 25, 2025
క్రిస్మస్ వేడుకల్లో రోజా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి మున్సిపాలిటీ నత్తంకండ్రికలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించారు. యేసు ప్రభువు సూచించిన మార్గంలో అందరూ నడవాలని రోజా సూచించారు.
News December 25, 2025
చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో వ్యాక్సిన్ పూర్తి

చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,22,502 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం, సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. మంగళవారం ఈ కార్యక్రమం పూర్తవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,08,470 మందికి పోలియో చుక్కలు వేశారు.
News December 24, 2025
చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


